బాబు పర్యటనలో చెప్పులతో దాడి చేసిన వ్యక్తుల అరెస్ట్

బాబు పర్యటనలో చెప్పులతో దాడి చేసిన వ్యక్తుల అరెస్ట్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పర్యటలో చెప్పులు,రాళ్ళ తో దాడి చేసిన వ్యక్తులను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు చంద్రబాబు కాన్వాయ్ వచ్చిన సమయంలో కొంత మంది పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆందోళన జరుగుతున్న సమయంలో కొంత మంది రాళ్లు,చెప్పులు చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పై వేశారు. అయితే అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా 238 మంది పోలీస్ సిబ్బంది తో బద్రత ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా రాజధాని ప్రాంతంలో డ్రోన్ వినయోగించి వీడియో చిత్రీకరించారని బస్సు పై రాళ్లు,చెప్పులు విసిరిన వ్యక్తులను అరెస్ట్ చేసి 41 నోటీస్ ఇచ్చామని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ పేర్కొన్నారు.

డ్రోన్ వినియోగించిన వారి పై కూడా కేసు నమోదు చేశామని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. చెప్పు విసిరిన భాస్కరరావు, రాయి విసిరిన సాంబయ్య అనే వ్యక్తుల పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతుందని, పోలీసుల వద్ద లాఠీలు లాక్కుని బస్సు పై  విసిరిన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల పై సిట్ బృందం ఏర్పాటు చేశారు. డీజీపీ ఆదేశాలు మేరకు గుంటూరు రూరల్ అడిషనల్ క్రైమ్ ఎస్పీ సిట్ బృందానికి ఇంచార్జ్ గా వ్యవహరించనున్నారు. జరిగిన ఘర్షణతొ పాటు పోలీసుల అలసత్వం పై కూడా సిట్ బృందం విచారణ చేయనున్నది. ఈ క్రమంలో తుళ్లూరు పోలీసు స్టేషన్ లో పెట్టిన అన్ని కేసులనూ సిట్ కి బదిలీ చేశారు. ఏడు రోజుల్లో సిట్ టీం నివేదిక ఇవ్వనున్నది.