సర్వం కాజల్ మయం !

సర్వం కాజల్ మయం !

 

తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీత'.  కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది.  సినిమా కథ ప్రథానంగా కాజల్ చేసిన సీత పాత్ర  మీదే ఉంటుందట.  టీజర్, ట్రైలర్లలో కూడా కాజల్ ఎక్కువగా హైలెట్ అవడం వలన సినిమాకు ఆమె మూలస్తంభం అయింది.  ఆమె క్రేజ్ మీదనే సినిమా ప్రమోషన్లు చేస్తున్నారు నిర్మాతలు.  కాజల్ సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అందంతో ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకుంటోంది.  సినిమా ఓపెనింగ్స్ ఆమె అభిమానుల మీదే ఆధారపడి ఉన్నాయి మరి.