వెనక్కు వెళ్లిన సీత !

వెనక్కు వెళ్లిన సీత !

 

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీత'.  టీజర్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 25న విడుదలచేయాలని అనుకున్నారు.  కానీ ఇప్పుడు విడుదలను మే 24కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.  అయితే ఈ వాయిదా వెనకున్న కారణాలేమిటనేది బయటకు రాలేదు.  తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అనిల్ సుంకర, అభిషేక్ అగరవేల్ సంయుక్తంగా నిర్మించారు.