పోలీసుల అదుపులో సినీ నటుడు శివాజీ

పోలీసుల అదుపులో సినీ నటుడు శివాజీ

సినీ నటుడు శివాజీని పోలీసులు కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌కు తరలించారు. అలంద మీడియా కేసులో గతంలోనే శివాజీకి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఈక్రమంలో ఇవాళ శంషాబాద్‌ నుంచి అమెరికా వెళ్లేందుకు శివాజీ ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకున్నారు.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌, శివాజీలు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తమను మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకున్నారని అలంద మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వారిద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్‌, శివాజీల నివాసంలో సోదాలు కూడా నిర్వహించారు. నోటీసులు అందడంతో రవిప్రకాష్‌ విచారణకు హాజరయ్యారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు.