హైకోర్టులో శివాజీ క్వాష్‌ పిటిషన్‌

హైకోర్టులో శివాజీ క్వాష్‌ పిటిషన్‌

సినీనటుడు శివాజీ ఇవాళ తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. తనపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తోపాటు శివాజీపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు హాజరు కావాల్సిందిగా వీరిద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు.