శివరాత్రికి స్టార్ హీరోల స్పెషల్ షోస్ !

శివరాత్రికి స్టార్ హీరోల స్పెషల్ షోస్ !

శివరాత్రి పర్వదినం వస్తుందంటే హైదరాబాద్లోని క్రాస్ రోడ్స్ సినిమా హాళ్ళనీ కళకళలాడుతుంటాయి.  ఎందుకంటే స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్ని జాగారం చేసే అభిమానుల కోసం స్పెషల్ షోస్ రూపంలో ప్రదర్శిస్తుంటారు.  ఈ ఏడాది కూడా మార్చి 4వ తేదీ మహాశివరాత్రి సందర్బంగా కొన్ని స్పెషల్ షోస్ సెట్ చేశాయి థియేటర్ యాజమాన్యాలు.  

శ్రీమయూరి థియేటర్లో చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం 150'ని తెల్లవారుజామున 2:50 గంటలకు ప్రదర్శించనుండగా మహేష్ బాబు యొక్క 'భరత్ అనే నేను' చిత్రాన్ని సుదర్శన్ థియేటర్లలో 12:15 గంటలకు, రామ్ చరణ్ 'రంగస్థలం' చిత్రాన్ని దేవిలో 12:30 గంటలకు ప్రదర్శించనున్నారు.