ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి

ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి

కర్ణాటకలోని బీదర్ లో విషాదం జరిగింది. బసవ కల్యాణ తాలూకాలోని చిల్లాగల్లిలో ఇంటి పై కప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పళ్ల వ్యాపారం చేసుకునే నదీమ్ షేక్ అనే వ్యక్తి తన కష్టంతో మట్టి ఇల్లు కట్టుకున్నాడు. మంగళవారం రాత్రి నదీమ్‌ తన భార్య ఫరీదా బానూ, నలుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలింది.  దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి మృతదేహాలను బయటికి తీశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.