శ్రీశైలం ప్రమాదంలో ఆరు మృతదేహాలు లభ్యం !

శ్రీశైలం ప్రమాదంలో ఆరు మృతదేహాలు లభ్యం !

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాద ఘటనలో చిక్కుకున్న తొమ్మిది మంది క్షేమంగా వస్తారని భావించినా ఆ ఆశలు అన్నీ అడియాశలే అయ్యాయి. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు. లోపల రెస్క్యూ సిబ్బందికు మొదట ఏఈ సుందర్ నాయక్ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. అందులో ముగ్గుర్ని సుందర్, ఫాతిమా, మోహన్ కుమార్ గా గుర్తించారు.

మరో రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అలానే మరో ముగ్గురి కోసం రెస్క్యూ బృందాల గాలింపు కొనసాగుతోంది. ఇక శ్రీ శైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబ సబ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సిఎం ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్య చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తో సిఎం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.