ఆరోతరగతి బాలుడి సాహసం: చిరుతపై ఎదురుదాడి... 

ఆరోతరగతి బాలుడి సాహసం: చిరుతపై ఎదురుదాడి... 

మైసూరు నగరానికి సమీపంలోని కడకొళ వద్ద ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది.  అయితే, చిరుత దాడి నుంచి బాలుడు ధైర్యంగా, చాక చక్యంగా తప్పించుకున్నాడు.  కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు.  వివరాల్లోకి వెళ్తే, గత శనివారం రోజున కడకొళ గ్రామానికి చెందిన నందన్ అనే బాలుడు ఆరోతరగతి చదువుతున్నాడు.  ఎప్పటిలానే స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా నందన్ పై ఓ చిరుత దాడి చేసింది.  అయితే, చిరుతను చూసి భయపడని నందన్ దానిపై ఎదురుదాడి చేశాడు.  ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు.  ఆ దాడిలో చిరుత కన్నుకు దెబ్బతగిలింది.  దీంతో బాలుడిని వదిలేసి ఆ చిరుత పారిపోయింది.  గాయపడిన నందన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం నందన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. బాలుడి సాహసాన్ని గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు.