కమల్ హసన్ కు చేదు అనుభవం..

కమల్ హసన్ కు చేదు అనుభవం..

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ను చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధురై అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుప్పరాన్‌కుంద్రమ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు ఆయనపైకి చెప్పులు విసిరారు. అవి కమల్ వాహనానికి తగిలి కిందపడ్డాయి. ఈ ఘటనపై కమల్ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే’ అంటూ కమల్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తీవ్ర దుమారానికి దారితీశాయి.