ఓట్లును చీల్చిన చిన్న పార్టీలు...

ఓట్లును చీల్చిన చిన్న పార్టీలు...

తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల గెలుపును బీఎస్పీ వంటి చిన్న పార్టీలు అడ్డుకునన్నారు. అత్యధిక స్థానాల్లో బీజేపీ, బీఎస్పీ, స్వతంత్రులు ఓట్లు చీల్చారు. ముఖ్యంగా.. టీఆర్‌ఎస్‌, మహాకూటమి, బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ పోటీ చేయగా.. ఆ పార్టీల తరఫున టికెట్‌ రానివారు బీఎస్పీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ వంటి పార్టీల తరఫున బరిలోకి దిగి.. ప్రధాన అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపించారు. 

 • బాల్కొండలో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది.
 • బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా బీఎస్పీ అభ్యర్థి వినోద్‌కు 40 వేల ఓట్లు వచ్చాయి. 
 • బోధన్‌లో కాంగ్రెస్‌ గెలుపును బీజేపీ, శివసేన ప్రభావితం చేశాయి.
 • జనగాంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ , సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
 • ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ 171 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ 6237 ఓట్లు, టీజేఎస్‌ 6053 ఓట్లు సాధించాయి.  
 • భూపాలల్లిలో స్పీకర్‌ మధుసూదనాచారికి బీజేపీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.
 • బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డికి ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన టీజేఎస్‌ అభ్యర్థి రమేష్‌ 4007 ఓట్లు సాధించగా.. బీఎల్‌ఎఫ్‌, స్వతంత్ర అభ్యర్థికి కలిపి 2307 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల బదిలీ కారణంగా కిషన్‌రెడ్డికి 1678 ఓట్లతో ఓటమి ఖాయమైంది.
 • కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ అవకాశాలను బీఎల్‌ఎఫ్‌ దెబ్బ తీసింది.
 • మధిరలో కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్క కేవలం 3567 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ బీఎల్పీ అభ్యర్థిఇకి ఏకంగా 23,030 ఓట్లు వచ్చాయి. ఆ ప్రభావం టీఆర్‌ఎస్‌పై పడింది.
 • నకిరేకల్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమిపై సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ప్రభావం చూపింది. ఆ పార్టీ ఏకంగా 10,383 ఓట్లు సాధించింది.
 • తాండూరులో బీజేపీ 10,548 ఓట్లు సాధించి గెలుపోటములను తారుమారు చేసింది.