యలమంచిలి మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్... అభ్యర్థి అదృశ్యం..?

యలమంచిలి మున్సిపల్ ఎన్నికల్లో ట్విస్ట్... అభ్యర్థి అదృశ్యం..?

యలమంచిలి మున్సిపల్ ఎన్నికల రాజకీయాల్లో ఊహించని ఘటన జరిగింది. అక్కడ 5వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మళ్ళ అప్పారావు అదృశ్యం అయ్యారు. ప్రచారానికి వెళ్లిన తన తండ్రి నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు అతను కుమాడు రవితేజ. ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నాయకులతో కలిసి వచ్చాడు అభ్యర్థి కుమారుడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీస్ స్టేషన్ కు అప్పారావు భార్య వచ్చింది. తన భర్త అదృశ్యం కాలేదని....బంధువుల ఇంటికి వెళ్లాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది. కౌన్సిలర్ అభ్యర్థితో ఫోన్ లో సంప్రదించి కిడ్నాప్ జరగలేదని నిర్ధారించుకున్నారు పోలీసులు. దాంతో ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకుండానే పీ.ఎస్.నుంచి వెళ్లిపోయారు టీడీపీ అభ్యర్థి భార్య, కుమారుడు.