స్మార్ట్ ఫోన్ల మీద దీపావళి ఆఫర్స్ ఇవే..

స్మార్ట్ ఫోన్ల మీద దీపావళి ఆఫర్స్ ఇవే..

దీపావళి వచ్చిందంటే ఆఫర్ల మీద ఆఫర్లు కస్టమర్లను ఊరిస్తూ ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, బంధువులకు గిఫ్ట్ లుగా ఇచ్చే మొబైల్స్ మీద కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్స్ తో పోటీ పడుతున్నాయి. ఈ-కామర్స్ ద్వారా ఫోన్ల అమ్మకాల కోసం పలు కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ఈ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఈ సందర్భంగా రూ. 30 వేల నుంచి రూ. 45 వేల మిడ్ రేంజ్ ఫోన్ల పర్ఫామెన్స్ ఎలా ఉందో చూద్దాం.

వన్ ప్లస్ 6, వన్ ప్లస్ 6టీ:
మిడ్ రేంజ్ ఫోన్లలో వన్ ప్లస్ 6 మంచి పర్ఫామెన్స్ కనబరుస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీని ధర ఇండియాలో రూ. 34,999 గా ఉంది. ఈ ధరలో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఫోన్ లభిస్తుంది. ఈ ధరకే మరో రూ. 5 వేలు కలుపుకుంటే ఇందులోనే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ దొరుకుతుంది. అయితే దీపావళి ఆఫర్ కింద ఈ పీస్ ను రూ. 34,999 కే అమెజాన్లో అందిస్తున్నారు.
ఇక మరికొద్ది రోజులు ఆగి మరింత మంచి ఫోన్ కొనుక్కుందామనుకునేవారికి వన్ ప్లస్ 6టీ మంచి ఆప్షన్. అయితే అక్టోబర్ 30నే ఇది మార్కెట్లోకి వస్తుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సర్/ స్క్రీన్ అన్ లాక్ ఫీచర్స్ ఉన్నాయి. 37000 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు వన్ ప్లస్ 6 కన్నా దీని లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే 3.5 ఎంఎం హెడ్ సెట్ జాక్ లేకపోవడం మైనస్ పాయింట్. ధర ఎంత అనేది తెలియరాలేదు కానీ.. రూ. 2 వేలు చెల్లించి అమెజాన్ లో ప్రీ బుక్ చేసుకోవచ్చు. 

హువావీ నోవా 3: 
మిడ్ రేంజ్ లో ఇది మరో మంచి ఫోన్. అయితే ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లో మాత్రమే లభిస్తుంది. వన్ ప్లస్ 6 కు దీటుగా దీని పర్ఫామెన్స్ ఉండడం విశేషం. అయితే కెమెరా విషయంలో దానికన్నా మరింత మెరుగ్గా ఉందంటున్నారు నిపుణులు. ట్విలైట్ కలర్, చూడచక్కని డిజైన్ దీని సొంతం. ఇందులో 2 ఫ్రంట్, 2 రియర్ కెమెరాలతో మొత్తం 4 కెమెరాలు దీని ప్రత్యేకత. 

వైవో నెక్స్: 
వైవో నెక్స్ లో పాప్అప్, మోటారైజ్డ్ సెల్ఫీ కెమెరా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 44,900. ఇక 6.59 అంగుళాల డిస్ ప్లే, గ్లాస్ బాడీ డిజైన్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉంది. క్లీన్ డిస్ ప్లే, కూల్ మోటారైజ్డ్ కెమెరా కోసం చూసేవారికి వైవో నెక్స్ బెటర్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. సైజ్ విషయంలో కొందరికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చంటున్నారు. అలాగే కెమెరా క్యాప్చర్ చేసే కలర్ సాచురేషన్ కాస్త ఓవర్ గా ఉందని నిపుణుల అబ్జర్వేషన్లో తేలింది.

ఎల్జీ జీ7 ప్లస్ థింక్యూ: 
రూ. 39,900 ప్రారంభ ధరతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ. రూ. 40వేల రేంజ్ లో 2కే రిజల్యూషన్ కెమెరాలు కలిగి ఉన్న అతి కొద్ది ఫోన్లలో ఇదొకటి. చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ లైట్ డిజైన్ వల్ల మంచి ఫీల్ కలిగిస్తుంది. స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ కారణంగా దీని పర్ఫామెన్స్ చాలా స్మూత్ గా ఉందంటున్నారు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ అదనపు అర్హతగా చెబుతున్నారు. ఇందులోని మైనస్ పాయింట్ బ్యాటరీ సామర్థ్యమే. మోడరేట్ యూజర్ 8-10 గంటలు మాత్రమే ఈ ఫోన్ ని వాడగలడు. ఓవరాల్ గా రూ. 40 వేల రేంజ్ లో ఇదొక మంచి ఫోన్. 

ఆసూస్ జెన్ ఫోన్ 5జడ్: 
ఆపిల్ ఐఫోన్ ఎక్స్ వంటి రూపురేఖలతో మిడ్ రేంజ్ లో అందుబాటులో ఉన్న ఫోన్ ఇది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లో రూ. 29,999 ధరలో లభిస్తోంది. ఇక 128 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ. 32,999గా ఉంది. హైయ్యర్ ఎండ్ లో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో రూ. 36,999గా ఉంది. పర్ఫామెన్స్ విషయానికొస్తే వన్ ప్లస్ 6 ప్రాసెసర్ ఉండడం వల్ల పర్ఫామెన్స్ చాలా బాగుందంటున్నారు. ఇందులో ప్రీమియమ్ ఫోన్ కూడా బాగానే ఉన్నా.. ఫింగర్ ప్రింట్ స్కానర్, కెమెరా మాత్రం మరింత అభివృద్ధి చెందాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.