రియల్‌మిపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్

రియల్‌మిపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్

 చైనా ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి తమ వినియోగ దారులకు శుభవార్త అందించింది. ఇండియా మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా తొలిసారి రియల్‌మి 2 ప్రో, రియల్‌మి సీ1 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. రియల్‌మి 2 ప్రో ఫోన్ ప్రారంభ ధర రూ. 13,990, రియల్‌మి సీ1 రూ. 6,999 లభిస్తోందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ మూడు రంగుల్లో బ్లాక్ సముద్రం, బ్లూ ఓషన్, ఐస్ లేక్ కలర్లలో రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. రియల్‌మి 2 ప్రో ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ గల రియల్‌మి 2 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 13,990, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 15,990, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ గల ఫోన్ 17,990 అందుబాటు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.