ఈ యోగా ప్యాంట్ చాలా స్మార్ట్ గురూ..

ఈ యోగా ప్యాంట్ చాలా స్మార్ట్ గురూ..

 

 

భవిష్యత్తులో ధరించే దుస్తులు, ఉపకరణాలు ఎలా ఉండబోతున్నాయనే విషయమై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ వాచ్ పెట్టుకొని ఎన్ని కేలరీలు కరిగించామని లెక్కలు వేసుకుంటున్నారు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల తయారీలో అగ్రగామి సంస్థ.. యాపిల్ అయితే ఇప్పడు తాము ఉత్పత్తి చేసే యాపిల్ వాచ్ కంటే మెరుగైన ఉపకరణాలు తయారు చేయనున్నట్టు తెలిపింది. వాటికి ఎలక్ట్రానిక్స్ సాంకేతికతతో పాటు ఆరోగ్య పరిరక్షణ జోడించనున్నట్టు చెప్పింది. దీంతో మిగతా సంస్థలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. 

న్యూయార్క్ కు చెందిన స్టార్టప్ కంపెనీ..వేరబుల్ ఎక్స్.. గత ఏడాది నాడి ఎక్స్ పేరుతో స్మార్ట్ యోగా దుస్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ దుస్తుల్లో వువెన్-ఇన్ టెక్నాలజీ వాడినట్టు కంపెనీ తెలిపింది.

ఈ దుస్తులు ధరించి యోగా చేస్తే అవి వివిధ యోగాసనాలను గుర్తించడమే కాకుండా సరైన విధంగా చేస్తున్నారా లేదా అనేది సున్నితమైన కంపనాల ద్వారా తెలుపుతుంది.

ఈ దుస్తుల్లో అమర్చిన ద పల్స్ అనే డివైస్, ఐఫోన్ కి కనెక్టయిన ద పల్స్ యాప్ కి ఎప్పటికప్పుడు మీ యోగా ప్రాక్టీస్ వివరాలు పంపుతుంది. 

ప్రస్తుతం వేరబుల్ ఎక్స్ మరో నాలుగు కొత్త డిజైన్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అంతే కాకుండా యోగా శిక్షణలో ఏ మేరకు పురోగతి సాధించారో తెలియజెప్పేలా యాప్ ని మరింత మెరుగుపరిచింది.