తన 13ఏళ్ల కెరీర్ లో మొదటిసారి ఓపెనర్ గా స్మిత్..!

తన 13ఏళ్ల కెరీర్ లో మొదటిసారి ఓపెనర్ గా స్మిత్..!

ఐపీఎల్ సీజన్ లేటుగా మొదలైనప్పటికి లేటెస్టుగా మొదలైనట్టు అనిపిస్తోంది. ఐపీఎల్ 2020లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది.  ఇది చెన్నై కి రెండవ మ్యాచ్ కాగా రాజస్థాన్ కు ఇదే మొదటి మ్యాచ్. ఈ మ్యాచ్ లో సీఎస్కె టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసింది. కాగా ఇప్పటివరకు మొత్తం 551 ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ తన పదమూడేళ్ల కెరీర్ లొనే మొదటిసారి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో స్మిత్ 47 బాళ్లలో 69 రన్నులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ కి యువ ఆటగాడు సంజూ సాంసన్ 32 బాళ్లలో 74 పరుగులు సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాంసన్ 9 సిక్సులు,1 ఫోర్ తో ఆకట్టుకున్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ మొత్తం 216 పరుగులు తీసింది.