అమేథిలో స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

అమేథిలో స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజకవర్గంలోని బరౌలియా గ్రామంలో రాత్రి జరిగింది. కొందరు దుండగులు ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నామని అమేథి ఎస్పీ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.