వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ తెలుగు ట్వీట్..!!

వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ తెలుగు ట్వీట్..!!

ఇప్పుడు రాజకీయంగా నాయకుల దృష్టి తెలుగు రాష్ట్రలపై ఉన్నది.  దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం విశేషం. కేంద్రం ప్రవేశ పెట్టిన పధకాలను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయడం కోసం కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.  రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోంది. 

తాజాగా కేంద్రం సమర్థ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.  ఈ పధకం ద్వారా యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తుంది.  ఇలా శిక్షణ పొందిన యువతకు ఉపాధి కల్పించే మార్గాలను కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ చూస్తున్నది.  ఈ పధకాన్ని దేశంలో 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.  ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో కూడా ఈ పధకాన్ని అమలు చేసేందుకు సిద్ధం అయ్యింది.  యువతకు అర్ధం అయ్యేలా ఈ పధకం గురించి స్మృతి ఇరానీ తెలుగులో ట్వీట్ చేశారు.  దీంతో పాటు చిన్న వీడియోను జతచేశారు.  ఈ ట్వీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.