నిమ్మగడ్డకు ఎస్ఎంఎస్ కలకలం.. కోర్టుకు వెళ్తానని హెచ్చరిక !

నిమ్మగడ్డకు ఎస్ఎంఎస్ కలకలం.. కోర్టుకు వెళ్తానని హెచ్చరిక !


ఏపీ సీఎంవోకి  ఎస్‌ఈసీ మధ్య ఎస్సెమ్మెస్‌ వివాదం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. లోక్ సభ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే సమవేశానికి హాజరుకావాలంటూ సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎస్సెమ్మెస్ పంపారు. అయితే రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న తనను ఎలా పిలిపిస్తారంటూ తమ పేషీ ద్వారా తిరిగి మెసేజ్‌ పంపారు నిమ్మగడ్డ.

హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న తనతో ఈ విధంగా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే ఎస్ఈసీ సెక్రటరీ వాణిమోహన్‌కు పంపబోయి పొరపాటున ఎస్ఈసీకి పంపామని  ప్రవీణ్ ప్రకాష్ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చారు. మరోవైపు తన అనుమతి లేకుండా ఎన్నికల నిర్వహణపై జరిగే సమావేశాలకు హాజరు కావొద్దంటూ వాణి మోహన్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు.