కృష్ణా జిల్లాలో తాబేళ్ల అక్రమ రవాణా

కృష్ణా జిల్లాలో తాబేళ్ల అక్రమ రవాణా

తాబేళ్ల అక్రమ రవాణా కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. అక్రమార్కులు కృష్ణా జిల్లా కైకలూరు నుంచి పశ్చిమ బెంగాల్ తరలిస్తున్న సుమారు 3 వేల తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. చేపలు, రొయ్యలు ప్యాకింగ్ మాదిరి తాబేళ్లను అక్రమ మార్గంలో తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. లారీ సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గతంలో ఇదే విధంగా తరలించారా? లేదా ఇదే మొదటి సారా? అని ఆరా తీస్తున్నారు. ఎందుకోసం వేల సంఖ్యలో తాబేళ్లను తరలిస్తున్నారనే విషయంపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.