స్పందన కార్యక్రమంలో పాము కలకలం..మంత్రికి తప్పిన ప్రమాదం..!!

స్పందన కార్యక్రమంలో పాము కలకలం..మంత్రికి తప్పిన ప్రమాదం..!!

వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి స్పందన కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.  మంత్రులు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి శంకర్ నారాయణ అనంతరపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజలు పాల్గొన్నాను.  ప్రజలు తమ సమస్యలు మంత్రికి చెప్తున్న సమయంలో సడెన్ గా పాము దూసుకొని వచ్చింది.  ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగింది.  ఆ పామును చూసిన ఆ వ్యక్తి.. షాక్ అయ్యాడు.  తేరుకొని కాలికి ఉన్న చెప్పుతో దాన్ని గట్టిగా అదిలించాడు.  భయంతో పాము జనాల్లోకి వచ్చింది.  జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు.  అక్కడి నుంచి ఆ పాము పొదల్లోకి వెళ్ళిపోయింది.