వైరల్: అక్కడ పాముల మసాజ్ వెరీ ఫేమస్...
ఈ మధ్యకాలంలో మసాజ్ సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. శరీరంపై శ్రద్ద పెరగడంతో యువత నుంచి ప్రతి ఒక్కరు మసాజ్ సెంటర్ కు వెళ్లి మసాజ్ చేయించుకుంటున్నారు. మసాజ్ లలో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే, ఈజిప్టు లోని కైరోలోని ఓ మసాజ్ సెంటర్ మాత్రం అన్నింటికంటే డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ పాములు, కొండచిలువలతో మసాజ్ చేయిస్తుంటారు. స్నేక్ మసాజ్ వలన అనేక అనారోగ్యసమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయని అంటున్నారు. అలానే స్నేక్ మసాజ్ వలన శరీరానికి రక్తప్రసరణ జరుగుతుందని స్నేక్ మసాజ్ సెంటర్ యాజమాన్యం చెప్తున్నది. మొదటిలో ఈ స్నేక్ మసాజ్ ను ఫ్రీగా చేశారు. స్నేక్ మసాజ్ అంటే భయపడి పారిపోయేవారని, తరువాత మెల్లిగా ఫేమస్ అయ్యిందని, 30 నిమిషాల స్నేక్ మసాజ్ కోసం 100 ఈజిప్టియన్ పౌండ్స్ వసూలు చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)