పోలింగ్‌ బూత్‌లో పాము...

పోలింగ్‌ బూత్‌లో పాము...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. కర్ణాటక కేఆర్‌పురం నియోజక వర్గంలోని కితానగర్‌ పోలింగ్‌ బూత్‌లోకి అనుకోకుండా ఓ పాము ప్రవేశించింది. ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ప్రజలు పాముని చూసి పరుగులు తీశారు. ఆ పాము మాత్రం పోలింగ్‌ బూత్‌ వద్దే కొద్దిసేపు అటూ ఇటూ తిరిగింది. దీంతో పోలింగ్‌ బూత్‌ వద్ద కాసేపు గందర గోళ పరిస్థితి నెలకొంది. చివరకు కొందరు జోక్యం చేసుకోవడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనా దృశ్యాలను అక్కడి ఓటర్లు కెమెరాలలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వివిధ పార్టీల నాయకులు తమ పార్టీకి ఓటువేయాలని ప్రచారాలతో హోరెత్తించారు కాబట్టి.. పాము కూడా ఓటు వేయడానికి వచ్చిందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.