సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అపర్ణ సైబర్ జోన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న శ్వేత వారణాసి భగవత్ అనే 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. తన ఫ్లాట్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్వేత... వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.