కామారెడ్డి వివాహిత అనుమానాస్పద మృతి..భర్తపైనే అనుమానం.!

 కామారెడ్డి వివాహిత అనుమానాస్పద మృతి..భర్తపైనే అనుమానం.!

కామారెడ్డికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య (25) బెంగళూరులో తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. భర్త రోహిత్ చంపి ఉంటాడని లేదా భర్త వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని శరణ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కిందటే శరణ్య ను రోహిత్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కామారెడ్డి కి చెందినవారే, అంతే కాకుండా క్లాస్ మేట్స్ కూడా. పెళ్ళైన కొన్నాళ్ల నుంచే రోహిత్ నిత్యం మద్యం సేవిస్తూ కొట్టడం వేధించడం చేశాడని శరణ్య పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులక్రితం భర్త వేధింపులతో శరణ్య కామారెడ్డిలోని తల్లిగారింటికి వచ్చేసింది. అయితే ఇకపై వేదించనని రోహిత్ పెద్దలు, కోర్టు సమక్షంలో ఒప్పుకొని మూడు నెలల కిందటే తమ కూతురుని తీసుకెళ్లాడని తల్లి తండ్రులు చెబుతున్నారు. కూతురి మరణవార్త తెలియటంతో హుటాహుటిన ఆమె తల్లితండ్రులు బెంగళూర్ బయలుదేరారు. అల్లుడు రోహిత్ ను  కఠినంగా శిక్షించాలని శరణ్య తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.