సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య... కారణం...?

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య... కారణం...?

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్రవంతి(26) ఆత్మహత్య చేసుకుంది. అయితే భర్త రవి కిరణ్, స్రవంతిలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలతో గత కొంత కాలంగా మియాపూర్ లోని గోపాల్ నగర్ లో నివాసం ఉంటున్నారు. భార్య భర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డింది స్రవంతి. విషయం తెలుసుకున్న పోలీసులు స్రవంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెప్పటారు.