మహాత్ముడి కళ్లద్దాలు వేలం.. అద్భుతమైన ధర పలికింది..
భారత జాతిపిత మహాత్మాగాంధీ కళ్లజోడును ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ వేలం వేసింది... ఈ వేలంలో అద్భుతమైన ధర పలికాయి మహాత్ముడి కళ్లద్దాలు.. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ధరించిన గోల్డ్ ప్లేటెడ్ జత కళ్ల అద్దాలను బ్రిస్టల్‌లో వేలానికి పెట్టగడా.. ఇవి 260,000 యూరోలకు అమ్ముడుపోవడం విశేషం. అంటే భారత కరెన్సీలు సుమారు రూ. 2.5 కోట్లు.. ఈ అద్దాలను అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని వ్యక్తి దక్కించుకున్నాడు. వీటిని వేలంలో తొలుత 15,000 యూరోల ధరకే రిజర్వ్ చేశామని ఆక్షనర్ ఆండీ స్టోవ్ తెలిపారు.. కాగా, భారత్ సహా చాలా దేశాల నుంచి ప్రజలు ఈ అద్దాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో.. ధర ఒక్కసారిగా పెరిగింది.
గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి మహాత్ముడి కళ్లజోడును సేకరించాడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించాడు. ఇవి పనికి రావని.. విసిరి పారేయాలని భావించాడట.. కానీ, ఇప్పుడు వీటితోనే అతడు తన జీవితాన్ని మార్చేంత డబ్బులను దక్కించుకున్నాడు. వీటిని వేలంలో ఉంచాలని మహాత్ముడి కళ్లజోడు ఇచ్చిన వృద్ధుడు గత కొన్నేళ్లుగా సమస్యలతో సతమతం అవుతున్నాడట.. కానీ, ఇప్పుడు అతడి జీవితం ఉన్నట్టుండి మార్చేసింది మహాత్ముడి కళ్లజోడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)