''నో పెళ్లి'' అంటూ పాటతో వచ్చేసిన సుప్రీమ్ హీరో... 

''నో పెళ్లి'' అంటూ పాటతో వచ్చేసిన సుప్రీమ్ హీరో... 

వరుస అపజయా నుండి ఈ మధ్యే బయటపడ్డాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. చిత్రలహరి, ప్రతిరోజు పండగ వంటి విజయాలు అందుకున్న తేజ్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్థానం వంటి సినిమాకు దర్శకత్వం వహించిన దేవ కట్టా తో ''సోలో బ్రతుకే సో బెటర్'' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తేజ్ కు జంటగా నివేదా పేతు రాజ్ నటిస్తుంది. అయితే ఈ రోజు ఈ సినిమా నుండి ఓ పాట విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ''నో పెళ్లి'' అంటూ పెళ్లి వల్ల వచ్చే కష్టాలను వివరిస్తున్నాడు మన  సుప్రీమ్ హీరో. ఈ పాట యువతను ముక్యంగా బ్యాచిలర్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటలో మరో ఇద్దరు హీరోలు వరుణ్ తేజ్ మరియు రానా తో పాటుగా ఇస్మార్ట్ భామ నభా నటేష్ కూడా కనిపిస్తుంది. అయితే ఇదివరకూ తేజ్ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. గోపీచంద్ తో గౌతమ్ నంద వంటి హిట్ సినిమా నిర్మించిన భగవాన్ మరియు జె.పుల్లారావు కలిసి సంయుక్తన్గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.