దేశంలో భారీగా  పెరుగుతున్న కరోనా కేసులు...లాక్ డౌన్ బాటలో రాష్ట్రాలు... 

దేశంలో భారీగా  పెరుగుతున్న కరోనా కేసులు...లాక్ డౌన్ బాటలో రాష్ట్రాలు... 

దేశంలో కరోనా  కేసులు రోజు రోజుకు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి.  ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు  నమోదవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ బాట పట్టాయి.  కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ విధించారు.  కర్ణాటకలోని బెంగళూరులో ఈనెల 14 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను విధించారు.  పదిరోజులపాటు ప్రజలెవరూ కూడా బయటకు రాకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.  అటు నాగాలాండ్ లో ఈనెల 31 వరకు లాక్ డౌన్ ను విధించారు.  నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.  

ఇకపోతే, మేఘాలయ రాష్ట్రంలో జులై 13, 14వ తేదీల్లో రాష్ట్రం రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ కానున్నది.  ఈ రెండు రోజులు  ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు.  అటు మహారాష్ట్రలో కూడా జులై 31 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉన్నది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు అలానే కొనసాగుతాయి.  అలానే రాష్ట్రంలోని జిల్లాల మధ్య కూడా రాకపోకలను నిషేదించారు.   కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వంప్రకటించింది.   ఇక ఝార్ఖండ్ లో జులై 31 వ తేదీ వరకు లాక్  డౌన్ అమలులో ఉన్నది.  హోటల్స్, సెలూన్స్, రెస్టారెంట్స్, ప్రార్ధన మందిరాలను కూడా మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు.   పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జులై  31 వరకు లాక్ డౌన్ విధించారు.  ప్రస్తుతం ఉన్న నిబంధనలను యధావిధిగా కొనసాగిస్తున్నారు.  జులై 10 వ తేదీ  నుంచే ఉత్తర ప్రదేశ్ లో మళ్ళీ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.  కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి.