దర్శకులు సిగ్గు లేకుండా కథలు లేవంటున్నారు - వెంకటేష్

 దర్శకులు సిగ్గు లేకుండా కథలు లేవంటున్నారు - వెంకటేష్

దర్శకుడిగా చేసిన తొలిప్రయత్నం 'కేరాఫ్ కంచరపాలెం'తో ప్రేక్షకులు, విమర్శకుల నుండే కాకుండా సినీ ప్రముఖుల నుండి కూడ ప్రశంసలు అందుకున్నాడు వెంకటేష్ మహా.   దాదాపు అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెంకటేష్ మహా కథ చెప్పిన విధానాన్ని ఎంతో పొగిడారు.  

ఇక దర్శకుడు కాకముందు వెంకటేష్ మహా తన బ్లాగ్ ద్వారా తన 'కేరాఫ్ కంచరపాలెం' ప్రాజెక్ట్ గురించి వివరించే క్రమంలో ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేశారు.  ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు కథలు చెప్పడానికి సినిమాలు చేయడంలేదు, కథలు లేకుండా సినిమాలు తీసి వాటిని ప్రమోట్ చేసుకోవడానికి ప్రేక్షకులకు కథలు చెబుతున్నారు, కొందరైతే సిగ్గు లేకుండా కొత్త కథలు లేవని, హీరోలు, నిర్మాతలు ఇలాంటి కథలే కావాలని అడుగుతున్నారని అంటున్నారు.  కొందరు తప్ప మిగతా వాళ్ళు  సెలబ్రిటీ స్టేటస్ కోసమే ఇండస్ట్రీలో ఉన్నారంటూ కథ అనేది ప్రేక్షకుల మనసుల్ని గెలవడానికి దర్శకుడికి ఒక ఆయుధమని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు రాశారు.