ఉన్నావో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలి...  

ఉన్నావో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలి...  

దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.  దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత పోలీసులను ప్రజలు పెద్ద ఎత్తున పొగడ్తలతో ముంచెత్తారు.  ప్రజలు పండగ చేసుకున్నారు.  పోలీసులను భుజాలపై ఎక్కించుకొని జిందాబాద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  దిశ కేసులో న్యాయం జరిగిందని, దిశ లాంటి ఘటన మరొకటి జరగకూడదని అంటున్నారు.  

ఇక ఇదిలా ఉంటె, ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో లో జరిగింది. యువతిపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లిన నిందితుడు తిరిగి వచ్చి కాపుగాసి, కిరోసిన్ పోసి తగలబెట్టారు.  ఈ ఘటనలో ఆ యువతి శరీరం 90 శాతానికి పైగా కాలిపోయింది.  ఆమె పరిస్థితి సీరియస్ గా ఉన్నది.  ఇప్పటికే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.  మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఉన్నావో అత్యాచారం కేసు నిందితులను కూడా దిశ కేసులో పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్టుగానే వారిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.  ఉత్తర ప్రదేశ్ లోనే మహిళలపై వేధింపులు ఎక్కువుగా ఉంటున్నాయి కాబట్టి నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.