దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యకైన రెడీ

దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యకైన రెడీ

ఉగ్రవాదుల ఆటలు ఇక సాగనియ్యం... వారి పీచమనిచేందుకు ఎంతదూరమైన వెళతాం అని  ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యకైన సిద్ధమన్నారు. భారత్ పాక్ మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు.  మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. నమో యాప్ ద్వారా 15 వేల లొకేషన్స్ నుంచి మోడీ ప్రసంగాన్ని కార్యకర్తలు చూశారు. ఈ సందర్భంగా మోడీ ...ఉగ్రదాడుల ద్వారా పాకిస్థాన్.. భారత్‌ను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. పాక్ మనల్ని అస్థిర పరచడానికి చూస్తోందని విమర్శించారు. ఇప్పుడు అందరం సైనికుల్లాగే అలెర్ట్‌గా ఉండాలి. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త కనీసం పది ఇళ్లకు వెళ్లి తమ దేశభక్తి గురించి చెప్పాలన్నారు. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి దాయాది దేశం ప్రయత్నిస్తోందన్నారు. కానీ దేశమంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి పాక్ దుష్ట ఆలోచనలను తిప్పి కొడుతోంది అన్నారు. ఇలాంటి సమయంలో భద్రతా బలగాల నైతిక స్థెర్యాన్ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించకూడదు అని పిలుపు నిచ్చారు.  మన సైనికులు సరిహద్దులో, సరిహద్దు అవతల కూడా తన పరాక్రమాన్ని చూపించారని పేర్కొన్నారు. ఇండియా ఒక్కటిగా జీవిస్తుంది.. ఒక్కటిగా పోరాడుతుందన్నారు. ఒక్కటిగా గెలుస్తుందన్నారు. ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అని ప్రధాని స్పష్టం చేశారు.