2019 క్రికెట్ ముందు కొన్ని రికార్డులు..!
ఒకప్పుడు క్రికెట్లో రికార్డులు సృష్టించారంటే.. ఆ రికార్డులను తిరగరాయడం ఎంతో కష్టం... కానీ, ఇప్పుడు క్రికెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది పొట్టి ఫార్మాట్ టీ-20. దీంతో తక్కువ బంతుల్లోనే సెంచరీలు బాదేయడం.. రికార్డులపై రికార్డులు నెలకొప్పలడం జరిగిపోతున్నాయి. అయితే, ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ సిరీస్‌ల వేదికగా నిలిచిన కొన్ని రికార్డులు ఇప్పుడు చర్చగా మారిపోయాయి. ఇప్పుడు బ్యాట్స్‌తో విధ్వంసం సృష్టిస్తోన్న ఎంతోమంది క్రికెటర్లు ఉన్న సమయంలో.. గత రికార్డులను ఓ సారి గుర్తుచేసుకుందాం.
అత్యధిక పరుగుల రికార్డు: 2003 ప్రపంచకప్‌లో క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు ఇవే.. ఇప్పటిదాకా ఆ రికార్డు దరిదాపుల్లోకి ఎవరూ రాలేకపోయారు. కానీ ఈ ప్రపంచకప్‌లో సచిన్ రికార్డు బద్దలయ్యే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అత్యధిక స్కోరు: వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 481గా ఉంది. గతేడాది ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఈ భారీ స్కోర్ చేసింది. ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం లేకపోలేదా. ఇక, వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా (417/6) పేరిట ఉండగా.. ఈ రికార్డు మాయమై.. కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం లేకపోలేదు.
ఒకే మ్యాచ్‌లో అత్యధిక స్కోర్: వరల్డ్ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు.. ఇప్పటి వరకు 237గా ఉంది. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 237పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 163 బంతుల్లోనే 237 పరుగుల రికార్డు నమోదు చేశారు. ఇది అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే అంచనాలున్నాయి.
అత్యధిక సెంచరీలు: ప్రపంచకప్ సిరీస్‌లో ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు 4గా నమోదైంది. ఈ రికార్డును 2015 ప్రపంచకప్‌లో శ్రీలంక వికెట్‌కీపర్ కుమార సంగక్కర సాధించాడు. అతడు వరుసగా నాలుగు సెంచరీలు చేసి ఈ రికార్డు నెలకొల్పారు. ఇక విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉండడంతో ఈ రికార్డు తుడిచేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)