కోడెల మెడపై గాట్లు..!

కోడెల మెడపై గాట్లు..!

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు.. ఉరివేసుకున్న ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన మృతిచెందారు.. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నామని.. వైద్యులు కూడా అదే చెబుతున్నట్టు తెలిపారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కోడెల ఫౌండర్ చైర్మన్‌గా ఉన్న బసవతారకం ఆస్పత్రిలోనే.. మృతిచెందడం బాధాకరమని విషయమని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆయన బాగా మానసిక ఒత్తిడికి గురయ్యారన్న సోమిరెడ్డి... పల్నాడి పులి.. పది మందిని కాపాడి.. పది మందికి ధైర్యం చెప్పిన వ్యక్తి.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్ విషయం అన్నారు. తప్పులు, ఒప్పులు కోర్టులు నిర్ణయిస్తాయి.. కానీ, ఆయనను వేధించడం మాత్రం సరైంది కాదన్నారు.