మోదీకి గుండెలు ఎదురుపెట్టిన నేత బాబే...

మోదీకి గుండెలు ఎదురుపెట్టిన నేత బాబే...

ప్రధాని నరేంద్ర మోడీకి గుండెలు ఎదురుపెట్టి నిలబడిన తొలి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... నెల్లూరు కోటమిట్టలో షాదీమంజిల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ... నెల్లూరు షాదీ మంజిల్ ఓ మోడల్‌గా గుర్తింపు పొందబోతోందన్నారు. బారాషహీద్ దర్గా ఆవరణలో వివిధ అభివృద్ధి పనుల కోసం సీఎం చంద్రబాబు రూ.20 కోట్ల నిధులు ప్రకటించారని తెలిపారాయన. ముస్లింల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని... బడ్జెట్ లో రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై కక్ష కట్టి సహకరించకపోయినా... అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు సోమిరెడ్డి.