'జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదు..!'

'జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదు..!'

తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియడం లేదని వ్యాఖ్యానించారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి... ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... తన అవినీతి సొమ్మును ప్రజలకు పంచేందుకు వైఎస్ జగన్ ముందుకొస్తే మంచిదేనంటూ సెటైర్లు వేశారు. మేం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ జగన్‌కు ఏం చేయాలో అర్థం కావడంలేదన్న సోమిరెడ్డి.. సంక్షేమ కార్యక్రమాలను తట్టుకోలేకే వేలం పాటల తరహాలో జగన్ వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.