'బీజేపీని ఎదిరించిన ఒక్క మగాడు ఆయనే..'

'బీజేపీని ఎదిరించిన ఒక్క మగాడు ఆయనే..'

దేశంలో బీజేపీని ఎదిరించిన ఒక్క మగాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసినప్పటికీ, రాష్ట్రం అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నదని అన్నారు. గత నాలుగేళ్లలో రైతుల పంటలు కొనుగోలు చేసేందుకు రూ.3800 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నయన్న సోమిరెడ్డి.. మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని.. ఏప్రిల్, మే లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.