సోమిరెడ్డికి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌

సోమిరెడ్డికి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 'సమీక్ష'కు ఎట్టకేలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రంలో కరువు, తుఫాన్‌ పరిస్థితుల పై రివ్యూ చేపట్టిన మంత్రి.. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తన ఛాంబర్‌లోనే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ, ఉద్యావన శాఖ ప్రత్యేక కమిషనర్లు అధికారులు హాజరుకానున్నారు. కరువు, తుఫాన్‌లపై సమీక్షకు హాజరయ్యే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లి అధికారులు అనుమతి పొందారు. గత రెండ్రోజులుగా సోమిరెడ్డి నిర్వహించిన సమీక్షలకు అధికారులు, కమిషనర్లు రాకపోవడంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే.