మోడీ, గడ్కరీ ఫోటోలు ఎందుకు లేవు

మోడీ, గడ్కరీ ఫోటోలు ఎందుకు లేవు

భారతదేశ చరిత్రలో పోలవరం ప్రాజెక్ట్ కు జరిగనన్ని ప్రారంభోత్సవాలు మరో ప్రాజెక్టుకు జరగలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రాజెక్ట్ పోలవరం ప్రకటనల్లో మోదీ, గడ్కరీ ఫోటోలు ఎందుకు ప్రచురించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ అవినీతి రహిత పాలన సాగిస్తుంటే, చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చేశారని ఆయన తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు, మధురపూడి విమానాశ్రయానికి టంగుటూరి పేరును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోడిని విమర్శించడం చూస్తుంటే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని నడిపించడం చేతకాదని స్పష్టమవుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. 

కేంద్రాన్ని విమర్శించడమే లక్ష్యం చేసుకుని భారత్ బంద్ కు టీడీపీ మద్దత్తు తెలిపింది. 13, 14 ఆర్ధిక సంఘం నిధులు, కేంద్రం నిధులు ఇస్తున్నా పెట్రోల్ పన్ను తగ్గించమనడం హాస్యాస్పదం. మూడు రూపాయిల చీప్ లిక్కర్ ను  50 కి అమ్ముతున్నారు. దీంతో 16వేల కోట్లు ఆదాయం వస్తోంది. పండుగల సమయాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం తాగిస్తున్నారు. తాగాక బ్రీత్ అనలైజర్ తో జరిమానాలు విధిస్తున్నారని ప్రభుత్వంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు.