పవన్ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు

పవన్ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు

ఈరోజు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని ఏపీ బీజేపీ అధ్యక్ష్యుడు సోము వీర్రాజు కలిశారు. తిరుపతి ఎంపీ అభ్యర్ధి,  ఎపీలో  రాజకీయ పరిస్థితుల పై చర్చించినట్టు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధి పై చర్చించారని ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతామని ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అభ్యర్ధి బీజేపీనా, లేక జనసేన నుంచి పోటీలో ఉంటారా అనేది మాకు ముఖ్యం కాదని ఉభయపార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామని సోము వీర్రాజు చెబుతున్నారు. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం అని ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించామన్న ఆయన కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని పేర్కొన్నారు.