మేము చంద్రబాబు ట్రాప్ లోకి వెళ్ళం.. ఆయనే మా ట్రాప్ లోకి రావాలి !

మేము చంద్రబాబు  ట్రాప్ లోకి వెళ్ళం.. ఆయనే మా ట్రాప్ లోకి రావాలి !

విశాఖలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. హిందుత్వం అనేది మతం కాదన్న అయన  చర్చ్ లు,దర్గాలు కడుతూ పాస్టర్లకు జీతాలు ఇచ్చిన వాళ్లు మతతత్వ వాదులని అన్నారు. ఇద్దరు మంత్రులు తిరుపతిలో క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెప్పారని, బీజేపీపై డిజిపి నిరాధారమైన ఆరోపణలు చేశారని అన్నారు. డీజీపీతో పాటు మంత్రి కూడా అబద్ధాలు చెబుతున్నారన్న ఆయన ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అందులో నిజం లేదు అని అన్నారు. డీజీపీని  తొలగించాలని కోరుతున్నామన్న సోము అప్పట్లో వెల్లంపల్లి  మాతో  ఉండి , కూల్చివేతల పై ఉద్యమం చేశారని ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లి మాట మార్చారని అన్నారు.

చర్చ్ లు, దర్గాలు కడితే విద్వేషాలు లేనిది మేము  గుడి  కోసం పాదయాత్ర చేస్తే విద్వేషాలు వస్తాయా ? అని ప్రశ్నించారు.18 నెలలు మేము రాష్ట్రం కోసం ఏం చేసాము ఎవరితోనైనా చర్చకు సిద్ధమని అన్నారు. దేవాలయాలు ధ్వంసం పై ఎవరిని  ఎందుకు అరెస్టు చేయడం లేదు ? అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం రాజకీయ పరమైన డ్రామా ఆడుతుందని అన్నారు. హిందువుల నిధులు వాడుకుంటారు.. ప్రజల నిధులతో చర్చ్ లు కడతారు.. ఇది ఏంటి అని అడిగితే మతతత్వం అంటారా ? అని ఆయన ప్రశ్నించారు. మేము చంద్రబాబు  ట్రాప్ లోకి వెళ్ళమని పేర్కొన్న సోము ఆయనే మా  ట్రాప్  లోకి రావాలని అన్నారు. గుడులను పరిరక్షించలేకపోతే  దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.