ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి ప్రమోషన్.. బ్రిటన్‌ కేబినెట్‌లో చోటు

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి ప్రమోషన్.. బ్రిటన్‌ కేబినెట్‌లో చోటు

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి బ్రిటిష్‌ ఎంపీ రిషి సునక్ భారీ ప్రమోషన్‌ కొట్టేశారు. బ్రిటన్‌ కేబినెట్‌లో చోటుచేసుకున్న భారీ మార్పుల్లో భాగంగా ప్రధాని తర్వాత రెండో స్థానంగా భావించే ఆర్థిక మంత్రి పోస్టు ఆయనకు దక్కింది. ప్రధాని జాన్సన్‌ చీఫ్‌ స్పెషల్‌ అడ్వైజర్‌ డొమినిక్‌ కమ్మింగ్స్‌తో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్థిక మంత్రి, పాక్‌ సంతతికి చెందిన సాజిద్‌ జావిద్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ తర్వాతి పోస్టు, ఆర్థిక శాఖ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న రిషిని ఆ బాధ్యతల కోసం ప్రధాని ఎంపిక చేశారు. తాజా పరిణామంతో భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతీ పటేల్, రిషి సునక్‌ కీలక బాధ్యతల్లో ఉన్నట్లయింది.