కన్న తండ్రిపై శాడిస్ట్ కొడుకు వీరంగం...

కన్న తండ్రిపై శాడిస్ట్ కొడుకు వీరంగం...

కన్న తండ్రిపై శాడిస్ట్ కొడుకు వీరంగం సృష్టించాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పి.యస్ పరిధిలోని ప్రగతి నగర్ లో చోటుచేసుకుంది. ప్రగతి నగర్ లో సంతోష్ స్థానికంగా నివాసం ఉండేవాడు. సోమవారం రాత్రి కన్న తండ్రి ప్రకాష్ ని బండరాయితో చితకబాది హింసించాడు శాడిస్ట్ కొడుకు. బండరాయితో కొట్టడంతో ప్రకాష్ మోహం నుజ్జు నుజ్జు అయి ఇంటి ప్రాంగణం అంతటా రక్తం మడుగుతో నిండిపోయింది. చావు బతుకుల మధ్య ఉన్న ప్రకాష్ ను అంబులెన్స్ సహాయంతో గాంధీ  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రకాష్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేసారు. అయితే సంతోష్ పరారీలో ఉన్నాడు. సంతోష్ పెట్టే హింసలు భరించలేకపోతున్నామని సంతోష్ భార్య పోలీసులకు తెలిపింది. రోజు కొడుతుంటాడని.. చెప్పలేని విధంగా హింసిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.