రిటైర్మెంట్ సొమ్ము కోసం కన్న తండ్రి హత్య..
మీర్పేట్ పరిధిలోని జిల్లెలగూడలో దారుణం జరిగింది. రిటైర్మెంట్ సొమ్ము కోసం కన్న తండ్రినే హత్య చేశాడో కసాయి కొడుకు. స్థానికంగా నివాసముంటున్న మేడిపల్లి కృష్ణ(58).. వాటర్ వర్క్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇటీవలై ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన డబ్బు విషయమై కృష్ణతో ఆయన కుమారుడు తరుణ్ నిన్న రాత్రి గొడవపడ్డాడు. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన తరుణ్.. కృష్ణను ఇనుపరాడ్డుతో తల మీద మోదాడు. వెంటనే కృష్ణను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందారు. ఆ తర్వాత పోలీస్స్టేషన్లో తరుణ్ లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)