తల్లి ఆస్తి కోసం స్మశానంలో అడ్డం తిరిగిన కొడుకు..

తల్లి ఆస్తి కోసం స్మశానంలో అడ్డం తిరిగిన కొడుకు..

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం తల్లి రాజమ్మ దహన సంస్కారాలకు చిన్న కొడుకు రవీందర్ అడ్డుపడిన ఘటన వెలుగులోకి వచ్చింది.  ఈ రోజు రాజమ్మ ఉదయం మృతి చెందింది. తల్లి పేరిట ఉన్న ఎకరం 27 గుంటల భూమిన తనకు  ఇస్తేనే తలకొరివి పెడుతానని చిన్న కొడుకు అడ్డం తిరిగాడు. తనకు వర్తించే భూమిలో కాకుండా మృతురాలి పెద్ద కొడుకు భూమిలోనే అంత్యక్రియలు చేసుకోవాలని అప్పటి దాకా తలకొరివి పెట్టనంటూ ఆస్తి కోసం గొడవ పడుతున్నాడు రవీందర్. చెప్పినా వినకుండా మొండికేస్తున్న చిన్న కొడుకు తీరు పై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అతను మాత్రం వినడం లేదు. ఘటనా స్థలానికి చేరుకొని తల్లి అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ పోలీసులు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు.