తండ్రి ఇచ్చిన మందు బాటిల్స్ తో ఇల్లు కట్టేసిన కొడుకు... ఎలానో తెలుసా? 

తండ్రి ఇచ్చిన మందు బాటిల్స్ తో ఇల్లు కట్టేసిన కొడుకు... ఎలానో తెలుసా? 

ఎవరైనా మందు బాటిల్ ఇస్తే దాన్ని ఖాళీ చేసి బయటపడేస్తాం. భవిష్యత్తులో ఆ బాటిల్ ఉపయోగపడుతుందని అస్సలు ఊహించం.  కానీ, ఓ వ్యక్తి మాత్రం ఫ్యూచర్ ను ఊచించాడు.  తండ్రి ఇచ్చిన మద్యం బాటిళ్లను జాగ్రత్తగా దాడుచుకున్నాడు.  ఒకటికాదు రెండేళ్లు కాదు....28 ఏళ్లపాటు ప్రతి ఏడాది తండ్రి తన పుట్టినరోజునాడు ఇచ్చిన బాటిళ్లను జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు. 

తన 28 వ పుట్టినరోజు తరువాత ఇల్లు కొనాలని అనుకున్నారు.  కానీ, ఇల్లు కొనేంత స్థోమత వారిదగ్గర లేకపోవడంతో తండ్రి ఇచ్చిన మద్యం బాటిళ్లు గుర్తుకు వచ్చాయి.  ఆ మద్యం బాటిళ్లను అమ్మకానికి పెట్టాడు.  పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది.  ఆ డబ్బుతో ఇల్లు కొన్నాడు.  ఈ సంఘటన స్కాట్లాండ్లో జరిగింది.  స్కాట్లాండ్ కు చెందిన మాధ్యూ అనే వ్యక్తి 1992 లో జన్మించాడు.  అలా పుట్టిన సమయంలో తన తండ్రి కొడుక్కు మద్యం బాటిల్ కొనిచ్చాడు.  అప్పటి నుంచి ప్రతి ఏడాది పుట్టినరోజునాడు మద్యం బాటిల్ కొనివ్వడం ఆనవాయితీగా మారింది.  అలా కొనిచ్చిన బాటిల్స్ ను కొడుకు అపురూపంగా దాచుకోవడం విశేషం.  అలా దాచుకున్న బాటిల్స్ ఇప్పుడు ఇల్లు కట్టుకునేందుకు అక్కరకు వచ్చాయి.