లెజెండ్ భామ... బికినీలో హంగామా..!!

లెజెండ్ భామ... బికినీలో హంగామా..!!

మోడలింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ సోనాల్ చౌహన్.  సైజ్ జీరో, పండుగ చేస్కో, లెజెండ్, డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించింది.  బాలయ్యతో చేసిన డిక్టేటర్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చింది.  ఇప్పుడు మరలా బాలకృష్ణ 105 వ సినిమాలో నటిస్తున్నది.  మోడలింగ్ రంగం నుంచి రావడంతో ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.  శరీరంలో అదనపు కొవ్వు మిల్లీమీటర్ కూడా ఉండదు.  అంతేకాదు.. కథ డిమాండ్ మేరకు స్కిన్ షో చేయడానికి రెడీగా ఉంటుంది లెజెండ్ బ్యూటీ.  

సినిమాతో పాటు అటు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు టాప్ రేంజ్ లో దూసుకుపోతుంటుంది.  సోషల్ మీడియా హాట్ హాట్ ఫొటోలతో యువతను రెచ్చగొడుతుంది ఈ అమ్మడు.  సోనాల్ చౌహన్ రీసెంట్ గా ఓ ఫోటోను పోస్ట్ చేసింది.  స్విమ్మింగ్ పూల్ లో రెడ్ కలర్ మోనోకినితో అదరగొట్టింది.  లాంగ్ డీప్ మోనోకిని అది.  కొసరి కొసరి వడ్డించినట్టు.. అందాలను కొసరి కొసరి చూపిస్తోంది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.