ముంబైలో సోనాలి..!!

ముంబైలో సోనాలి..!!

గత కొంతకాలంగా బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  క్రిటికల్ స్టేజ్ లో ఉండగా ఆమెకు క్యాన్సర్ ఉన్నట్టుగా బయటపడటంతో హుటాహుటిన అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నది. క్రిటికల్ స్టేజ్ కి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఉండటంతో ట్రీట్మెంట్ తీసుకోవడం సులభం అయింది.  

ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ఆమెను అనేకమంది బాలీవుడ్ నటులు, స్నేహితులు వచ్చి ఆప్యాయంగా పలకరించారు.  ఎంత కష్టం వచ్చినా చిరునవ్వును మాత్రం కోల్పోలేదు సోనాలి.  ఎట్టకేలకు ట్రీట్మెంట్ ముగించుకొని ఇండియా వచ్చింది.  ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉన్న సమయంలో ఆమె అభిమానులు ఫోటోలు క్లిక్ మనిపించారు.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.