పాఠాలు నేర్పిన జీవితం

పాఠాలు నేర్పిన జీవితం

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే గత కొంతకాలంగా క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అమెరికాలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది.  క్యాన్సర్ అని నిర్ధారణ జరిగిన సమయంలో పడిన బాధ ఎలా ఉంటుందో.. ఆ బాధనుంచి కోలుకొని బయట పాడటానికి చేసిన ప్రయత్నాలు ఎలాంటివో.. దాని వెనుక దాగున్న కష్టం ఏంటో.. సోనాలి బింద్రే ఒక చిన్న నోట్ రూపంలో రాసుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

జీవితంలో వెలుగు నీడలు సహాయం.  వెలుగు వెంటే నీడ ఉంటుంది.  కష్టం వెనుకాలే సుఖం ఉంటుంది.  ఏవి శాశ్వతం కాదు.  కష్టం వచ్చినపుడు కుంగిపోకుండా.. పోరాటం చేయాలి.  సుఖం వచ్చినపుడు సేదతీరుతునే.. కష్టం రాకుండా చూసుకోవాలి.  జీవితం అనే రణరంగంలో ఒక సైనికుడిలా నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి అప్పుడే గెలుపు మన వాకిట నిలుస్తుంది.  ఏ రంగంలో తీసుకున్న గెలుపే ముఖ్యం.  గెలిచినవాడిదే జీవితం.  ప్రతి ఒక్కరు తన జీవితం నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలని సోనాలి తన ట్విట్టర్లో పేర్కొన్నది.  ఇప్పుడు సోనాలి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.