మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ

మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ

మరికొద్ది గంటల్లో నరేంద్రమోడీ దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నేతలతో పాటు 6వేల మంది అతిథులు రానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కాగా.. ప్రమాణస్వీకారానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా హజరుకానున్నట్లు సమాచారం. అలాగే అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు. బిమ్‌స్టెక్ దేశాలకు చెందిన అధినేతలను మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విదేశీ పర్యటనకు వెళ్తున్నందున ఆమె బదులు ఆ దేశ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ హమీద్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియింట్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని కేపీ ఓలీ, భూటాన్ ప్రధాని లోటే త్సేరింగ్, థాయిలాండ్ ప్రత్యేక రాయబారి గ్రిసాడా బూన్రాచ్ హాజరు కానున్నారు. వీరితో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్ గొగోయ్‌, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పలు రాష్ట్రాల సీఎంలు, త్రివిధ దళాల అధిపతులు, పార్లమెంటు ఉభయ సభ్యులు ప్రమాణ స్వీకారానికి హజరవుతున్నారు.